Fri Jan 30 2026 17:11:51 GMT+0000 (Coordinated Universal Time)
పతంజలి సిమ్ కార్డులు...మామూలు ఆఫర్లు కావుగా...

ఇప్పటి దేశీయ ఉత్పత్తుల పేరుతో ఎఫ్ఎంసీజీ మార్కెట్లో దూసుకుపోతున్న బాబా రాందేవ్ ‘పతంజలి’ సంస్థ టెలికాం రంగంలోకి ప్రవేశించింది. ఈ మేరకు స్వదేశీ సమృద్ధి పేరుతో బీఎస్ఎన్ఎల్ తో కలిసి సిమ్ కార్డులను ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతానికి ఇవి పతంజలి ఉద్యోగులకే పరిమితమైనా అతిత్వరలో ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఈ సిమ్ కార్డుల ద్వారా 144 రీఛార్జ్ తో అపరిమిత కాల్స్, 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా అందిస్తోంది కంపెనీ. ఈ సిమ్ లు బీఎస్ఎన్ఎల్ కౌంటర్లతో పాటు పతంజలి కేంద్రాల్లో కూడా అమ్మనున్నారు. అయితే ఈ సిమ్ కార్డుల ద్వారా ఇతర సేవలు కూడా అందిచనుంది పతంజలి. ఈ సిమ్ కార్డుల ద్వారా పతంజలి ఉత్పత్తులపై 10 శాతం రాయితీ కూడా ప్రకటించింది. ఇక వినియోగదారులకు సీమ్ కార్డులతో వైద్య, ప్రమాద, జీవిత బీమాలు కూడా ఇస్తామని ప్రకటించింది.
Next Story

