Thu Jan 29 2026 19:47:28 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధం

2019 పార్లమెంటు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తొమ్మిది దశల్లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 6వ తేదీన మొదటి దశ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఏపీలో ఏ విడతలో ఎన్నికలు జరుగుతాయో స్పష్టత రావాల్సి ఉంది. 2014లో ఏపీలో మే 7న ఎన్నికలు జరిగగా, మే 16న ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే.
Next Story

