Fri Dec 05 2025 13:15:29 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు రెండు నెలల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా మూడు [more]
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు రెండు నెలల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా మూడు [more]

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు రెండు నెలల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు విపక్షాలు పట్టు పట్టనున్నాయి. ఇటీవల ఎర్రకోట వద్ద జరిగిన ఘటనతో పాటు, రైతు సమస్యలపై విపక్షాలు గళమెత్తనున్నాయి. నేడు ఉభయ సభల నుద్దేశించి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని పదిహేడు ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించనున్నట్లు ప్రకటించాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
Next Story