Thu Mar 19 2026 19:37:59 GMT+0530 (India Standard Time)
మతిచలించే దీక్ష
చంద్రబాబు నాయుడికి మతి చలించే దీక్షలకు దిగారని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే చంద్రబాబు దీక్ష [more]
చంద్రబాబు నాయుడికి మతి చలించే దీక్షలకు దిగారని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే చంద్రబాబు దీక్ష [more]

చంద్రబాబు నాయుడికి మతి చలించే దీక్షలకు దిగారని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే చంద్రబాబు దీక్ష డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేనేలేదని, వరదల వల్లనే కొద్దికాలం పాటు కొరత వచ్చిందన్నారు. ఇసుకను మాఫియాలాగా చేసి దోచుకున్నది చంద్రబాబు మాత్రమేనని పార్థసారధి అన్నారు. తెలుగుదేశం పార్టీ దిక్కు తోచకనే దీక్షలకు దిగుతుందని అన్నారు. చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితి లేదని పార్థసారధి అన్నారు.
Next Story