Thu Dec 18 2025 18:01:12 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా
తెలంగాణ మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మొత్తం 4470 గ్రామ పంచాయితీలకు మొదటి విడతలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, 759 పంచాయితీలు [more]
తెలంగాణ మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మొత్తం 4470 గ్రామ పంచాయితీలకు మొదటి విడతలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, 759 పంచాయితీలు [more]

తెలంగాణ మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మొత్తం 4470 గ్రామ పంచాయితీలకు మొదటి విడతలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, 759 పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 606 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికవగా కాంగ్రెస్ బలపర్చిన వారు 34 స్థానాల్లో ఎన్నికయ్యారు. ఏకగ్రీవాలతో కలిపి ఇప్పటివరకు 1932 పంచాయితీల ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో 1290 పంచాయితీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 293 స్థానాలను, టీడీపీ 8 స్థానాలను, బీజేపీ 24 స్థానాలను, సీపీఐ 6 స్థానాలను, సీపీఎం 10 స్థానాలను, స్వతంత్రులు 301 స్థానాలను దక్కించుకున్నారు.
Next Story