Mon Dec 22 2025 08:09:35 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీ మారలేదనే నాపై కక్ష
తాను పార్టీ మారలేదనే తనపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని టీడీపీ నేత పల్లాశ్రీనివాసరావు ఆరోపించారు. తనను పార్టీ మారాలని కొన్నాళ్లుగా వత్తిడి చేస్తున్నారన్నారు. పార్టీ మారనందున [more]
తాను పార్టీ మారలేదనే తనపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని టీడీపీ నేత పల్లాశ్రీనివాసరావు ఆరోపించారు. తనను పార్టీ మారాలని కొన్నాళ్లుగా వత్తిడి చేస్తున్నారన్నారు. పార్టీ మారనందున [more]

తాను పార్టీ మారలేదనే తనపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని టీడీపీ నేత పల్లాశ్రీనివాసరావు ఆరోపించారు. తనను పార్టీ మారాలని కొన్నాళ్లుగా వత్తిడి చేస్తున్నారన్నారు. పార్టీ మారనందున తనపై భూ ఆక్రమణల ప్రచారం చేస్తున్నారన్నారు. నిన్న విశాఖలో స్వాధీనం చేసుకున్న భూములు తనవి కావని పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ప్రజాసేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, డబ్బులు సంపాదన కోసం కాదని ఆయన తెలిపారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిజం కాదని త్వరలోనే తేలుతుందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
Next Story