Sun Feb 01 2026 19:57:33 GMT+0000 (Coordinated Universal Time)
అవిశ్వాసానికి మద్దతుపై తమిళనాడు సీఎం క్లారిటీ

కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మాణానికి మద్దతు ఇవ్వమని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తేల్చిచెప్పారు. తాము కావేరీ నదీ జలాల విషయంలో పోరాటం చేస్తుంటే తమకు ఏ పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. లోక్ సభలో మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న అన్నాడీఎంకేకు 37 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు డీఎంకే పార్టీ నేత స్టాలిన్ మాత్రం అవిశ్వాస తీర్మాణానికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. అన్నాడీఎంకే సైతం మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
Next Story

