Sun Mar 15 2026 01:35:08 GMT+0530 (India Standard Time)
డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు ఎన్నిక
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు పోటీగా ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు [more]
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు పోటీగా ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు [more]

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు పోటీగా ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్కతో పాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. గత క్యాబినెట్ లో పద్మారావు మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక, మొన్న మృతిచెందిన బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డికి అసెంబ్లీ సంతాపం తెలియజేసింది.
Next Story