Fri Jan 30 2026 08:38:10 GMT+0000 (Coordinated Universal Time)
పోలవరానికి పట్నాయక్...?

పోలవరం ప్రాజెక్టు పనులు తక్షణమే నిలపివేయాలని కోరుతూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ కు లేఖ రాశారు. పోలవరం నిర్మాణం పూర్తయితే ఒడిశాకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఈ మేరకు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రెండుసార్లు లేఖ రాశానని తెలియజేశారు. శబరి, సీలేరు నదీ జలాల విషయం తేలకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం గోదావరి జలాల ట్రైబ్యునల్ నిబంధనలను అతిక్రమించడమేనని ఆయన ఆరోపించారు. పునరావాసం, జలాల పంపిణీ వంటి అంశాలు తేలేవరకు పోలవరం పనులు ఆపాలని ఆయన కోరారు.
Next Story

