Mon Feb 02 2026 14:23:46 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై కేరళ మాజీ ముఖ్యమంత్రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి ఊమన్ చాందీ మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా జగన్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై జగన్ వెనక్కు తగ్గారని, కాపులను రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని నిరుత్సాపరచడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేసిందని, చంద్రబాబు నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.
Next Story

