Fri Jan 30 2026 15:15:00 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీ మారడంపై మాగుంట క్లారిటీ
పార్టీ మార్పుపై ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి క్లారిటీ ఇచ్చారు.

పార్టీ మార్పుపై ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన కుటుంబంపై గత కొద్ది రోజులుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాము పార్టీని వీడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. తమ కుటుంబం 32 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఉందని తెలిపారు. తన సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి తొలిసారి ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత ఇక వెనుదిరిగి వెళ్లలేదన్నారు. తాను మూడు సార్లు ఒంగోలు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించానని, ప్రజలు తమ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారన్నారు.
జగన్ వెంటే....
అందరి శాసనసభ్యులతో కలిసి మెలిసి ఉండబట్టే తాము గెలుస్తూ వస్తున్నామని చెప్పారు. తనకు శాసనసభ్యులతో ఎవరితోనే ఎలాంటి ఇబ్బందులు లేవని మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తమ కుటుంబం పై ఉన్నవీ లేనివీ కొందరు ప్రచారం చేస్తుండటం తమకు బాధ కలిగిస్తుందని తెలిపారు. ఆ ప్రచారాలన్నీ మానుకుంటే మంచిదని హితవు పలికారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, వైసీపీలోనే కొనసాగుతానని చెప్పారు. తనతో పాటు తన కుమారుడు రాఘవరెడ్డి జగన్ వెంటే నడుస్తామని ఆయన వివరణ ఇచ్చారు. అసత్య ప్రచారం చేసి తమ కుటుంబాన్ని అప్రదిష్ట పాలు చేయవద్దని కోరారు.
Next Story

