Sun Mar 15 2026 11:53:56 GMT+0530 (India Standard Time)
నేడు తిరుపతి, సాగర్ ఉప ఎన్నికలు..పోలింగ్ కు ఏర్పాట్లు
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. తిరుపతి [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. తిరుపతి [more]

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీసులు అక్కడ విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా నేడు జరగనుంది. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు చేసిన కృషి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. కరోనా కేసులు తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలింగ్ శాతంపై అనేక అనుమానాలు ఉన్నాయి.
Next Story