Thu Mar 19 2026 06:29:45 GMT+0530 (India Standard Time)
ఏపీకి ఢిల్లీ దెబ్బ ఎక్కువగానే ఉన్నట్లుంది
ఢిల్లీలో జరిగిన మతప్రార్థనల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 500 మంది పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి కరోనా [more]
ఢిల్లీలో జరిగిన మతప్రార్థనల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 500 మంది పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి కరోనా [more]

ఢిల్లీలో జరిగిన మతప్రార్థనల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 500 మంది పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. వీరిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఎక్కువగా ప్రకాశం, గుంటూరు, కడప, అనంతపురం, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారు ఎక్కువ గా ఉన్నట్లు పోలీసులు తమ విచారణలో కనుగొన్నారు. వీరిలో 200 మందిని మాత్రమే ఇప్పటి వరకూ కనుగొని వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. క్వారంటైన్ లో ఉంచారు. మిగిలిన వారి కోసం వెతుకులాట ప్రారంభించారు.
Next Story