Thu Dec 18 2025 14:15:21 GMT+0000 (Coordinated Universal Time)
స్లో గా ఉందని అనిపిస్తున్నా.. బాగానే పెరుగుతున్నాయి
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ప్రస్తుతం ఇండియాలో 1834 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 41 మంది చనిపోయారు. లాక్ డౌన్ [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ప్రస్తుతం ఇండియాలో 1834 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 41 మంది చనిపోయారు. లాక్ డౌన్ [more]

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ప్రస్తుతం ఇండియాలో 1834 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 41 మంది చనిపోయారు. లాక్ డౌన్ గత పది రోజుల నుంచి కొనసాగుతున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ప్రధానంగా ఢిల్లీలోని జమాత్ కు హాజరయిన వారిని వెంటనే గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. వీరి వల్లనే కరోనా వ్యాప్తి జరుగుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. 24 గంటల్లో కొత్త కేసులు 384 వరకూ వస్తే అందులో దాదాపు 180 వరకూ ఢిల్లీ జమాత్ కు హాజరయిన వారే కావడం గమనార్హం.
Next Story

