Tue Mar 17 2026 08:58:41 GMT+0530 (India Standard Time)
సోదరి పోటీపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

కూకట్ పల్లి నుంచి తన సోదరి సుహాసిని విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు హీరో జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తల్లి షాలిని, భార్య లక్ష్మీప్రణతితో కలిసి హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్ బూత్ వద్ద అభ్యర్థులు గురించి మాట్లాడలేనని... తన సోదరి గెలవాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, బాధ్యతగా ఓటు వేయాలని కోరారు. ఎన్టీఆర్ సుహాసిని తరపున ప్రచారం చేస్తారనుకున్నా ఆయన దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం ఆమె రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తూ ఆయన మొదట్లో ఒక లేఖ మాత్రం విడుదల చేశారు.
Next Story

