Thu Mar 26 2026 04:25:53 GMT+0530 (India Standard Time)
కూకట్ పల్లిలో బాబుకు నో పర్మిషన్

కూకట్ పల్లిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోడ్ షోకు పోలీసుల అనుమతి లభించలేదు. కూకట్ పల్లి ప్రజాకూటమి అభ్యర్థిగా హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు కూకట్ పల్లిలో చంద్రబాబు రోడ్ షోకు అనుమతిని తెలుగుదేశం పార్టీ కోరగా పోలీసులు నిరాకరించారు. అంతకుముందే టీఆర్ఎస్ నేత కేటీఆర్ రోడ్ షోలకు అనుమతి ఇచ్చి ఉండటంతో బాబు రోడ్ షోకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చారు. దీంతో మిగిలిన ప్రాంతాల్లో చంద్రబాబు రోడ్ షో ఈరోజు జరగనుంది.
Next Story

