Sun Mar 22 2026 20:14:10 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హోదాపై ఎన్.కే సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కే.సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆక్ష్న గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించిన అనంతరం మాట్లాడుతూ... ప్రత్యేక హోదాను తప్పించేందుకు 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపారు అని ఆయన పేర్కొన్నారు. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు పునర్విభజన చట్టం అమలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండేదన్నారు. ఇప్పుడు ఏపీ పునర్విభజన చట్టం అమలుకు ప్రత్యేక వ్యవస్థ ఏమి లేదన్నారు. రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభలో పాస్ అయినప్పుడు తాను రాజ్యసభలోనే ఉన్నాని, అన్ని విషయాలూ తనకు తెలుసన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటు భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
Next Story

