Sat Jan 31 2026 06:36:58 GMT+0000 (Coordinated Universal Time)
సినీ ఫక్కీలో విడిపోయిన ప్రేమికులు

పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రేమికులకు ఊహించని షాక్ ఎదురైంది. నిజామాబాద్ నగరంలోని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకోవడానికి ప్రేమికులు వచ్చారు. వారికి అండగా కొందరు స్నేహితులు కూడా ఉన్నారు. అయితే, ఈ విషయం ఎలానో యువతి కుటుంబసభ్యులకు చేరింది. దీంతో మరో ఐదు నిమిషాల్లో పెళ్లి అనగా పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై దిగిపోయారు యువతి తరుపు వారు. అర్య సమాజ్ లోకి చొచ్చుకెళ్లి యువతిని తమ వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రేమికుడు అడ్డుకోబోగా అతడిపై దాడి చేశారు. సదరు యువతి వెళ్లడానికి నిరాకరించగా ఆమెనూ కొట్టి లాక్కెళ్లారు. దీంతో కొద్దిసేపట్లో ఒకటవనున్న ప్రేమ జంట విడిపోవాల్సి వచ్చింది.
Next Story

