సామాన్యుల బడ్జెట్ ఇది
ఇది సామాన్యుల బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2020 – 2021 బడ్జెట్ ను పార్లమెంటులో నిర్మల ప్రవేశపెట్టారు. ప్రజల ఆదాయం [more]
ఇది సామాన్యుల బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2020 – 2021 బడ్జెట్ ను పార్లమెంటులో నిర్మల ప్రవేశపెట్టారు. ప్రజల ఆదాయం [more]

ఇది సామాన్యుల బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2020 – 2021 బడ్జెట్ ను పార్లమెంటులో నిర్మల ప్రవేశపెట్టారు. ప్రజల ఆదాయం పెంచే దిశగా బడ్జెట్ ఉంటుందని నిర్మల చెప్పారు. ఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ కీలకమైనదని చెప్పారు. సంస్కరణలను వేగవంతం చేశామన్నారు. ఆర్థిక రంగం మూలాలు బలంగా ఉన్నాయన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టామని నిర్మల తెలిపారు. పాలనారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. అన్ని రంగాల్లో వృద్ధిరేటు పెరిగితేనే వ్యవస్థ చక్కబడుతుందని నిర్మల అభిప్రాయపడ్డారు. జీఎస్టీ విషయంలో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముందు చూపుతో వ్యవహరించారన్నారు. జీఎస్టీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాభపడ్డాయని చెప్పారు.
పన్ను మదింపులో…..
ఇన్స్ పెక్టర్ రాజ్ కు చరమగీతం పాడామని, దీనివల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు లాభపడ్డాయని నిర్మల చెప్పారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. 16 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు చేరారని చెప్పారు. 40 కోట్ల మంది పన్ను రిటర్న్ లు దాఖలు చేశారన్నారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ ద్వారా ప్రభుత్వ పథకాలు వేగంగా ప్రజలకు చేరుతున్నాయన్నారు. ఏప్రిల్ నుంచి మరింత వేగంగా పన్ను రిటర్న్ లు ఉంటాయన్నారు. ప్రపంచంలోనే ఇప్పుడు మనది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు. జీఎస్టీ వల్ల ప్రతి కుటుంబానికి 4 శాతం ఆదా అయిందన్నారు. ఈ బడ్జెట్ లో మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రుణాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ప్రతి పౌరుడికి అందేలా చూస్తామన్నారు. ఆయుష్మాన భవ అద్భుత ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా కృషి చేయనున్నట్లు తెలిపారు.
రైతు బడ్జెట్ ఇది….
జీడీపీలో ఇపుడు 47.8 శాతం అప్పులు తగ్గాయని చెప్పారు. వ్యవసాయాభివృద్ధికి 16 సూత్రాల కార్యక్రమం చేపట్టామని తెలిపారు. వ్యవసామ మార్కెటింగ్ కు సరళతరమైన విధానానలను ప్రవేశపెట్టనున్నామన్నారు. సోలార్ పంప్స్ తో 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. వేర్ హౌస్ లన్నింటికీ జయో ట్యాగ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. భారత రైల్వేల ఆధ్వర్యంలో ఇక కిసాన్ రైలు ఉంటుందన్నారు. నీటి ఎద్దడి ఉన్న 100 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలను ఇస్తామన్నారు. గ్రామీణ స్టోరేజీ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు నిర్మల వెల్లడించారు. ఆర్గానిక్ ఫార్మింగ్ కు అత్యధిక ప్రాధాన్యతమిస్తామన్నారు. వ్యవసాయ పరపతి లక్ష్యం పదిహేను లక్షల కోట్లు ని చెప్పారు. చేపల పరిశ్రమపై యువతకు శిక్షణ ఇస్తామన్నారు. ఉద్యానపంటలకు ప్రోత్సహకాలుంటాయని చెప్పారు. రాష్ట్రాలకు మూడు మోడల్ చట్టాలను తెస్తున్నట్లు నిర్మలాసీతారామన్ కు తెలిపారు.

