Mon Feb 02 2026 20:13:47 GMT+0000 (Coordinated Universal Time)
డీఎస్ కుమారుడిపై నిర్భయ కేసు

తన కళాశాలలో చదివే విద్యార్థినులపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురం సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిన్న సీఓడబ్లూ నాయకురాలు సంధ్య ఆధ్వర్యంలో 12 మంది విద్యార్థినులు హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని కలిసి సంజయ్ పై ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరపాలని హోంమంత్రి వెంటనే డీజీపీ కి సూచించారు. ఇవాళ ఉదయం విద్యార్థినులు మళ్లీ నిజామాబాద్ సీపీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే, రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఆరోపణ వచ్చాయని సంజయ్ చెబుతున్నారు. ఎవరో తమ కుటుంబంపై కుట్ర పన్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
Next Story

