Thu Mar 26 2026 16:51:08 GMT+0530 (India Standard Time)
హైకోర్టులో నిమ్మగడ్డ పిటీషన్.. టెన్షన్..టెన్షన్
పంచాయతీ ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ నేడు విచారణకు రానుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై నిమ్మగడ్డ [more]
పంచాయతీ ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ నేడు విచారణకు రానుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై నిమ్మగడ్డ [more]

పంచాయతీ ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ నేడు విచారణకు రానుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. అయితే రెగ్యులర్ విచారణ చేపట్టాలని బెంచ్ పేర్కొంది. నేడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ విచారణకు రానుంది. షెడ్యూల్ విడుదల చేశామని, వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండగానే ఎన్నికలను నిర్వహించవచ్చని ఎన్నికల కమిషన్ పేర్కొంటుంది. అయితే కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం పేర్కొంటుంది. దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న టెన్షన్ నెలకొంది.
Next Story