Sat Aug 20 2022 00:23:03 GMT+0000 (Coordinated Universal Time)
అందుకే నిమ్మగడ్డ గవర్నర్ ను కలిశారా?

గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ ముగిసింది. ప్రధానంగా ఎన్నికల కు ప్రభుత్వోద్యోగులు సహాయ నిరాకరణపైనే ఆయన ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తోంది. తాను షెడ్యూల్ ఇచ్చిన ఉద్దేశ్యాన్ని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు వివరించారు. దాదాపు అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో తాను ఏ పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జాయింట్ కమిషనర్ ను విధుల నుంచి తొలగించిన విషయాన్ని నిమ్మగడ్డ గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఉద్యోగ సంఘాలు బహిరంగంగానే తాము ఎన్నికలకు వెళ్లమని చెప్పడాన్ని కూడా గవర్నర్ కు తెలియజేశారు. తాను డివిజన్ బెంచ్ కు వెళ్లిన విషయాన్ని కూడా గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్్ తెలియజేశారు.
Next Story