Sat Mar 28 2026 18:14:35 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డ మరోసారి.. హైకోర్టుకు?
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు థిక్కార పిటీషన్ ను ఆయన దాఖలు చేశారు. రాజ్యాంగ బద్ద [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు థిక్కార పిటీషన్ ను ఆయన దాఖలు చేశారు. రాజ్యాంగ బద్ద [more]

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు థిక్కార పిటీషన్ ను ఆయన దాఖలు చేశారు. రాజ్యాంగ బద్ద సంస్థ అయిన ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏదో ఒక అడ్డు చెబుతూనే ఉందని నిమ్మగడ్డ రమేష కుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఇక్కడ మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు పిటీషన్ దాఖలు చేశారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పారు.
Next Story