బ్రేకింగ్ : హైకోర్టులో నిమ్మగడ్డ పిటీషన్ ..స్థానికసంస్థల ఎన్నికలు
స్థానిక సంస్థల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల [more]
స్థానిక సంస్థల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల [more]

స్థానిక సంస్థల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ తో సహకరించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఎన్నికల కమిషన్ కు నలభై లక్షల నిధులకు గాను 39 లక్షలు విడుదల చేశామని ప్రభుత్వం తరుపున న్యాయవాది తెలిపారు. ఎన్నిలక నిరవ్హణకు సహకరించేలా ఆదేశాలివ్వాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పిటీషన్ లో కోరారు. అయితే అలాంటి ఆదేశాలు అవసరం లేదని ప్రభుత్వం తరుపున న్యాయవాది తెలిపారు. ఎక్కడెక్కడ ప్రభుత్వం సహకరించం లేదో అఫడవిట్ రూపంలో దాఖలుచేయాలని హైకోర్టు ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.