Fri Mar 20 2026 22:06:28 GMT+0530 (India Standard Time)
గవర్నతో భేటీ తర్వాత కూడా నిమ్మగడ్డ?
గవర్నర్ తో భేటీ అయిన తర్వాత కూడా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర [more]
గవర్నర్ తో భేటీ అయిన తర్వాత కూడా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర [more]

గవర్నర్ తో భేటీ అయిన తర్వాత కూడా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయాలన్న తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారుల వద్ద స్పష్టం చేసినట్లు తెలిసింది. కరోనా వైరస్ విజృంభిస్తుండటం వల్ల, ఇతర రాష్ట్రాలు అనేక ముందస్తు చర్యలు చేపడుతుండటంతోనే తాను ఎన్నికలను వాయిదా వేసినట్లు ఆయన అధికారులకు చెప్పారు. గవర్నర్ తో భేటీ తర్వాత కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని ప్రకటించడం విశేషం.
Next Story

