న్యాయనిపుణులతో నిమ్మగడ్డ చర్చలు.. ఎలా చేయాలి?
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. ఈ మేరకు ఆయన న్యాయనిపుణులతో [more]
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. ఈ మేరకు ఆయన న్యాయనిపుణులతో [more]

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. ఈ మేరకు ఆయన న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ఈ ఎన్నికలకు కూడా రీ నోటిఫికేషన్ ఇవ్వాలా? లేక కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలా? అన్న దానిపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయసలహాలు తీసుకుంటున్నారు. మార్చి 14వ తేదీతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుండటంతో, దాని తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు.