Tue Mar 24 2026 02:15:31 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డ పర్యటనకు పోలీసుల అభ్యంతరం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటనకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. నేడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పుంగనూరులో పర్యటించాల్సి ఉంది. అయితే శాంతి భద్రతల [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటనకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. నేడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పుంగనూరులో పర్యటించాల్సి ఉంది. అయితే శాంతి భద్రతల [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటనకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. నేడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పుంగనూరులో పర్యటించాల్సి ఉంది. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పుంగనూరులో ఎక్కువ సంఖ్యలో పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో అక్కడ పర్యటించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావించారు. అయితే పోలీసులు అంగీకరించడం లేదు. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేస్తారో చూడాలి.
Next Story