Wed Jan 21 2026 00:19:52 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యేపై నిమ్మగడ్డ ఆంక్షలు.. మాట్లాడకూదంటూ…?
పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధించారు. ఈనెల 13వ తేదీ వరకూ మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. జోగి [more]
పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధించారు. ఈనెల 13వ తేదీ వరకూ మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. జోగి [more]

పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధించారు. ఈనెల 13వ తేదీ వరకూ మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. జోగి రమేష్ ప్రజలతో కూడా మాట్లాడకూడదంటూ కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలలో వైసీపీ నుంచి కాకుండా ఎవరు పోటీ చేసినా ఊరుకునేది లేదని, ఎవరైనా పోటీ చేస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వ పథకాలను కట్ చేస్తామని అన్నారు. జోగి రమేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఎస్ఈసీకి కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో జోగిరమేష్ పై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది.
Next Story