Fri Jun 09 2023 17:09:51 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల విధుల నుంచి వారికి మినహాయింపు
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విధుల నుంచి కొందరికి మినహాయింపు ఇస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్య సమస్యలతో [more]
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విధుల నుంచి కొందరికి మినహాయింపు ఇస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్య సమస్యలతో [more]

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విధుల నుంచి కొందరికి మినహాయింపు ఇస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. యాభై ఏళ్లకు పైబడిన వారు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు, గర్భిణులు, బాలింతలకు మినహాయింపు ఇవ్వాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. అమరావతి ఉద్యోగుల జేఏసీ వినతి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story