Mon Dec 08 2025 13:54:38 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీడీపీకి నోటీసులు జారీ చేసిన నిమ్మగడ్డ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల మ్యానిఫేస్టోకు సంబంధించి టీడీపీ వివరణను కోరారు. ఫిబ్రవరి 2వ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల మ్యానిఫేస్టోకు సంబంధించి టీడీపీ వివరణను కోరారు. ఫిబ్రవరి 2వ [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల మ్యానిఫేస్టోకు సంబంధించి టీడీపీ వివరణను కోరారు. ఫిబ్రవరి 2వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలకు టీడీపీ అధినేత చంద్రబాబు మ్యానిఫేస్టో విడుదల చేయడంపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సరైన వివరణ ఇవ్వని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీకి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.
Next Story