Thu Mar 26 2026 00:27:41 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం… పంచాయతీ ఎన్నికలను?
ఏపీ లో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. రెండోదశ ఎన్నికలను మొదటి దశలో, మూడో దశను [more]
ఏపీ లో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. రెండోదశ ఎన్నికలను మొదటి దశలో, మూడో దశను [more]

ఏపీ లో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. రెండోదశ ఎన్నికలను మొదటి దశలో, మూడో దశను రెండోదశలోనూ, నాలుగో దశలను మూడో దశగా, మొదటి దశను నాలుగో దశలో నిర్వహించేలా రీషెడ్యూల్ చేస్తున్నారు. నిజానికి తొలుత జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఇంకా నామినేషన్ల పత్రాల ముద్రణ కూడా ప్రారంభం కాలేదు. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29 నుంచి మొదటిదశలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరిస్తారు.
Next Story