Mon Dec 08 2025 17:16:26 GMT+0000 (Coordinated Universal Time)
సహకరించని ప్రభుత్వం.. గవర్నర్ వద్దకు నిమ్మగడ్డ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వ అధికారులు ఎవరూ సహకరించడం లేదు. నోటిఫికేషన్ విడుదల చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో వీడియో [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వ అధికారులు ఎవరూ సహకరించడం లేదు. నోటిఫికేషన్ విడుదల చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో వీడియో [more]

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వ అధికారులు ఎవరూ సహకరించడం లేదు. నోటిఫికేషన్ విడుదల చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించారు. కానీ ఏ ఒక్క అధికారి ఈ కాన్ఫరెన్స్ కు హాజరు కాలేదు. తాము ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎన్నికలకు సిద్ధంగా లేమని ఉద్యోగుల సంఘాలు చెప్పాయి. అవసరమైతే తాము సమ్మెకు వెళతామని హెచ్చరించాయి. ఎన్నికలకంటే తమ ప్రాణాలు ముఖ్యమని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. దీంతో అధికారులు సహకరించకపోవడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు గవర్నర్ ను కలవనున్నారు.
Next Story