Thu Mar 26 2026 07:13:29 GMT+0530 (India Standard Time)
నేడు గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గవర్నర్ కు నిమ్మగడ్డ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గవర్నర్ కు నిమ్మగడ్డ [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గవర్నర్ కు నిమ్మగడ్డ వివరించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ తొలిదశలో రేపు వెలువరించనుండటంతో గవర్నర్ ను కలిసి తెలపనున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ సహకారం ఇచ్చేలా కృషి చేయాలని నిమ్మగడ్డ గవర్నర్ ను కోరనున్నారు. ఈ నెల 23, 27, 31, ఫిబ్రవరి నాలుగోతేదీన నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ లు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలవనున్నారు.
Next Story