Tue Mar 17 2026 18:00:04 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : నిమ్మగడ్డ పిటీషన్ పై ప్రభుత్వం కౌంటర్ ఇదే
మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి [more]
మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి [more]

మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి పిటీషన్ దాఖలు చేశారు. గవర్నర్ ఆమోదించిన తర్వాతే ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. తనను తొలిగించేందుకే ఆర్డినెన్స్ తెచ్చారనడం వాస్తవం కాదని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం తగ్గించే అధికారం గవర్నర్ కు ఉందని పిటీషన్ లో ప్రభుత్వం పేర్కొంది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు తీసుకు రావడంలో భాగంగానే రమేష్ కుమార్ పదవీకాలం కుదించడం జరిగిందన్నారు.
Next Story