Fri Mar 21 2025 01:02:32 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కేసు: ఏపీ పోలీసులపై కోర్టు సీరియస్
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసుల తీరుపై ఎన్ఐఏ కోర్టు సీరియస్ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి సీట్ వద్ద [more]
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసుల తీరుపై ఎన్ఐఏ కోర్టు సీరియస్ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి సీట్ వద్ద [more]

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసుల తీరుపై ఎన్ఐఏ కోర్టు సీరియస్ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి సీట్ వద్ద ఉన్న ఆధారాలు, వివరాలన్నీ ఎన్ఐఏకి అప్పగించాలని కోర్టు విశాఖపట్నం ఏసీపీ నాగేశ్వరరావుకు ఆదేశాలిచ్చింది. తమ విచారణకు సిట్ పోలీసులు సహకరించడం లేదని, ఆధారాలు ఇవ్వడం లేదని ఎన్ఐఏ విజయవాడలోని ప్రత్యేక కోర్టును ఆశ్రయిచింది. రెండు రోజులుగా ఎన్ఐఏ పిటీషన్ విచారించిన కోర్టు సిట్ పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్ఐఏ విచారణకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది.
Next Story