Fri Mar 27 2026 22:42:44 GMT+0530 (India Standard Time)
మావోలకు పేలుడు పదార్థాలు... ఎన్జీఆర్ఐ ఉద్యోగి అరెస్ట్

మావోయిస్టులకు పేలుడు పదార్ధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై చత్తీస్ గఢ్ లో హైదరాబాద్ వాసి నక్కా వెంకట్ రావును అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. చత్తీస్ గఢ్ లోని ఓ మారుమూల ప్రాంతంలో మావోలకు పేలుడు పదార్థాలు అందజేస్తుండగా ఆయన పోలీసులకు చిక్కారు. వెంకట్ రావు హైదరాబాద్ లోని ఎన్జీఆర్ఐలో ఉద్యోగి. ఆయన సోదరుడు పౌర హక్కుల సంఘం నాయకుడిగా ఉన్నారు. తెలంగాణతో పాటు ఏడు రాష్ట్రాల్లో మావోయిస్టుల నెట్ వర్క్ ను బలోపేతం చేయడంలో వెంకట్ రావు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 2016-17లో ఆయన మావోయిస్టు ముఖ్య నేతలతో సమావేశం అయినట్లు పోలీసులు తెలిపారు. వెంకట్ రావు ‘అర్బన్ నక్సలైట్’ అని పోలీసులు ఆరోపించారు. అయితే, మావోయిస్టులకు, వెంకట్ రావుకి ఎటువంటి సంబంధాలు లేవని ఆయన కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు.
Next Story

