Thu Jan 29 2026 01:16:58 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే మూడు వారాలు తెలంగాణకు కీలకం
తెలంగాణలో వచ్చే మూడు వారాలు అత్యంత కీలకమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అయితే కరోనా వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన [more]
తెలంగాణలో వచ్చే మూడు వారాలు అత్యంత కీలకమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అయితే కరోనా వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన [more]

తెలంగాణలో వచ్చే మూడు వారాలు అత్యంత కీలకమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అయితే కరోనా వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీనివాసరావు తెలిపారు. నైట్ కర్ఫ్యూతో కొంత కరోనా కంట్రోల్ లోకి వచ్చిందని ఆయన తెలిపారు. మే నెలాఖరు వరకూ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందేనని శ్రీనివాసరావు తెలిపారు. మాస్క్ లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంతోనే కరోనాను తరిమికొట్టగలమని శ్రీనివాసరావు తెలిపారు. పెళ్లిళ్లకు దూరంగా ఉంటేనే మేలని ఆయన సూచించారు. తెలంగాణలో 99.5 శాతం రికవరీ రేటు ఉందని ఆయన చెప్పారు.
Next Story