Thu Mar 19 2026 16:38:29 GMT+0530 (India Standard Time)
కాబోయే సీఎం జగన్..? గూగూల్ లో గగ్గోలు

ఆంధ్ర ప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్.జగనేనా..? అంటే అవుననే అంటోంది గూగుల్. రానున్న ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ల మద్య త్రిముఖ పోటీ ఉన్న విషయం తెలిసిందే. ముగ్గురూ ఎన్నికల కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, రానున్న ఎన్నికల్లో ఎవరూ గెలుస్తారో రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేయలేని ప్రస్థుత పరిస్థితుల్లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తర్వాతి ముఖ్యమంత్రి అంటోంది గూగుల్. ’నెక్ట్స్ సీఎం ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ అని గూగుల్ లో టైప్ చేయగా జగన్మోహన్ రెడ్డి అని చూపిస్తోంది. దీంతో ఆ పార్టీ అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

Next Story

