లాక్ డౌన్ పెట్టకుంటే వెయ్యి కోట్లకు ఎసరు
స్వాదాద్రి రియల్ ఎస్టేట్ మోసాలు కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంలో వెయ్యి కోట్ల రూపాయలు ప్రజల నుంచి కొట్టాలని ప్లాన్ చేశారు. ఎందుకు సంబంధించి [more]
స్వాదాద్రి రియల్ ఎస్టేట్ మోసాలు కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంలో వెయ్యి కోట్ల రూపాయలు ప్రజల నుంచి కొట్టాలని ప్లాన్ చేశారు. ఎందుకు సంబంధించి [more]

స్వాదాద్రి రియల్ ఎస్టేట్ మోసాలు కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంలో వెయ్యి కోట్ల రూపాయలు ప్రజల నుంచి కొట్టాలని ప్లాన్ చేశారు. ఎందుకు సంబంధించి ఎండి రఘు చేసిన ప్లాన్ లో దాదాపు వర్కౌట్ అయింది. కానీ లాక్డౌన్ విధించడంతో రఘు ప్లాన్ పూర్తిగా బెడిసి కొట్టింది. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మంచి ఊపు ఉన్నదని రఘు గ్రహించాడు. ఇందులో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ కి మకాం మార్చిన రఘు వెంటనే ఏజెంట్లను నియమించుకున్నాడు. మొత్తం 70 మంది ఏజెంట్లను నియమించాడు. వీరి ద్వారా వ్యవహారాన్ని నడపడం మొదలుపెట్టాడు. అయితే ఎక్కడ కూడా డబ్బులకు సంబంధించిన లావాదేవీలు కంపెనీతో పాటు గా రఘు పేరు రాకుండా చూసుకున్నాడు.
ఏజెంట్ల ద్వారానే…..
ముఖ్యంగా ఏజెంట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించాడు. డబ్బులన్నింటిని కూడా ఏజెంట్ ద్వారా తీసుకొని వారి ద్వారానే పూర్తిగా ఫ్లాట్ల క్రయ విక్రయాలు జరిపారు. అయితే ఇప్పటి వరకు 156 కోట్ల రూపాయల వరకు ప్రజల దగ్గర కుచ్చుటోపి పెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. పెద్ద మొత్తంలో డబ్బులన్ని కూడా ఏజెంట్ కే తిరిగి కమీషన్ల రూపంలో చెల్లించినట్లు గా బయట పడింది. అయితే కొంత వరకు తన వ్యక్తిగత పేర్లు తో పాటుగా బినామీ పేర్లతో రఘు ఆస్తులను కొనుగోలు చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు విజయవాడలో పెద్ద మొత్తంలో ఆస్తులను బినామీల పేర్లతో రఘు కొనుగోలు చేశాడు. దీంతోపాటుగా 20 మంది ఏజెంట్ల ద్వారా కూడా రఘు ఆస్తులను కొనుగోలు చేశారు.
బినామీ పేర్లతోనే….
మొత్తం బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులన్నింటినీ తాము గుర్తించామని సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ చీఫ్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇంటి స్థలాలు తో పాటుగా ఫ్లాట్ లలో పెట్టుబడి పెట్టిన వారందరికీ ఢోకాలేదని వాళ్ళకు సంబంధించిన పత్రాలను ఇప్పటికీ తాము స్వాధీనం చేసుకున్నామని, కంపెనీలో కూడా కొన్ని పత్రాలు దొరికాయని అలాంటి వారికి న్యాయం చేసేందుకు వీలు పడుతుందని చెప్పారు. అయితే బైబ్యాక్ పాలసీ పేరుతోటి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టిన వారే తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 10 లక్ష రూపాయల పెట్టుబడి పెడితే సంవత్సరంలోగా 5 లక్షల రూపాయలు తిరిగి ఇస్తామని ప్రకటించిన వారే పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ పెట్టుబడులకు సంబంధించి ఎక్కడ కూడా సమాచారం లేదని రికార్డులు కూడా ఎక్కడ దొరకడం లేదని పోలీసులు వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెట్టిన స్వాదాద్రి రఘు కేసులో మరి కొన్ని వ్యవహారాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.

