Fri Jan 30 2026 20:49:34 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుతో మమతా బెనర్జీ భేటీ

నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు ముఖ్యమంత్రులతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడి ఏపీ భవన్ లో చంద్రబాబుతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా చంద్రబాబును కలవనున్నారు. వీరు ముగ్గురూ కలిసి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసి సంఘీభావం తెలపనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కేజ్రీవాల్ గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story

