Mon Mar 23 2026 09:08:54 GMT+0530 (India Standard Time)
సీట్లు కాదు... పొత్తు ముఖ్యం

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. టిక్కెట్లపై మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దని, బలం ఉన్న చోటే పోటీ చేద్దామని ఆయన స్పష్టం చేశారు. తమకు సీట్లు ముఖ్యం కాదని, పొత్తే ముఖ్యమని, తెలంగాణలో కచ్చితంగా ప్రజా కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టిక్కెట్లు దక్కని నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఆయన అభయం ఇచ్చారు.
Next Story

