Mon Mar 23 2026 06:00:10 GMT+0530 (India Standard Time)
జగన్ కు కనిపించడం లేదా..?

పక్క జిల్లాలోనే ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు శ్రీకాకుళం వరద బాధితులు కనిపించలేదా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన కోటబొమ్మాళి మండలం కొత్తపేట గ్రామంలో పర్యటించి తుఫాను బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతంలో చిచ్చురేపేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయన్నారు. తుఫాను వచ్చిన వారం తర్వాత పవన్ కళ్యాణ్ కు బాధితులు గుర్తుకు వచ్చారని పేర్కొన్నారు. ఎవరైనా తుఫాను ప్రభావిత గ్రామాలను దత్తత తీసుకుంటే ఆ గ్రామినికి వారి పేరు శాశ్వతంగా గుర్తిండేలా చేస్తామని ఆయన తెలిపారు.
Next Story

