Sun Mar 22 2026 15:29:07 GMT+0530 (India Standard Time)
జగన్ సీఎం అవ్వడం ఖాయమట

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు సత్తా ఉంటే తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కు దమ్ము, ధైర్యం ఉంటే ఒంటరిగా బరిలోకి దిగి తేల్చుకోవాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడే తెలంగాణలో కాంగ్రెస్ కి, టీడీపీకి పొత్తు కుదిరిచ్చి వెళ్లాడని అన్నారు. ఆంధ్రలో ఎలాగూ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తాడని తెలుసుకున్న చంద్రబాబు తెలంగాణలో ఆయన చంచాలు నలుగురు అసెంబ్లీలో ఉంటే ఇక్కడైనా నడిపించవచ్చని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని అన్నారు.
Next Story

