Sun Mar 22 2026 10:20:47 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మరో జాతీయ సర్వేలో జగన్ హవా.. 21 ఎంపీ సీట్లు..!

మరో జాతీయ ఛానల్ నిర్వహించిన సర్వేలో వైఎస్ జగన్ హవా కొనసాగించారు. లోక్ సభ ఎన్నికలను ప్రధానాంశంగా తీసుకుని రిపబ్లిక్ టీవీ - సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 21 శాతం ఎంపీ స్థానాలు గెలుచుకోనున్నట్లు అంచనా వేసింది. ఇక అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 4 స్థానాలు మాత్రమే గెలుచుకోనున్నట్లు తెలిపింది. ఇక కాంగ్రెస్, బీజేపీ ఖాతా కూడా తెరిచే అవకాశాలు లేనట్లు అంచనా వేసింది. ఇక ఓట్ల శాతానికి వస్తే జగన్ 41.9 శాతం ఓట్లు సాధించనున్నారని, తెలుగుదేశం పార్టీ 31.4 శాతం ఓట్లు, బీజేపీ 12.5 శాతం, కాంగ్రెస్ 7.2 శాతం, ఇతరులు 7 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఇతరుల్లో జనసేన ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల ఇండియా టూడే గ్రూప్ నిర్వహించిన ఫలితాల్లోనూ జగన్ కే ఆధిక్యత కనిపించిన విషయం తెలిసిందే.
Next Story

