Fri Jan 30 2026 15:54:27 GMT+0000 (Coordinated Universal Time)
బాబు పగలబడి నవ్వారే...!

ప్రధాని నరేంద్రమోదీపై తెలుగుదేశం మహానాడు వేదికపై ఆ పార్టీ తెలంగాణ నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించాయి. ఆయన వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పడిపడి నవ్వారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గుడిని, గుడిలో హుండీని దొంగలించేరకమన్నారు. ఆయనది ముద్దు యాత్రనో..గుద్దుల యాత్రనో అర్థం కావడం లేదన్నారు. ప్రధాని నరేంద్రమోడీ దేశానికి అచ్చేదిన్ తీసుకువస్తానని చెప్పి సచ్చేదిన్ తీసుకువచ్చారన్నారు. ఇప్పుడు బ్యాంకులు ఊడ్చే పనిచేలో ఆయన చాలా బిజీగా ఉన్నారన్నారు. పిల్లలకు చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఆశపెట్టి ఇవ్వని తండ్రులను నరేంద్ర మోడీతో పోలుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నర్సిరెడ్డి ప్రసంగం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పగలబడి నవ్వడం కన్పించింది.
Next Story

