Sat Jan 31 2026 20:34:45 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ నోటిని నిలువరించాలని రాష్ట్రపతికి లేఖ

ప్రతిపక్ష నేతలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేస్తున్న వ్యాఖ్యలు అవమానకరంగా, శాంతికి భంగం కలిగించేలా ఉన్నాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి రామ్ నాధ్ కొవింద్ కు లేఖ రాశారు. గతంలో పనిచేసిన ప్రధానులు చాలా హుందాగా వ్యవహరించేవారని, కానీ నరేంద్రమోదీ వ్యాఖ్యలు మాత్రం అందుకు విరుద్ధంగా అవమానకరంగా, బెదిరింపు ధోరణితో ఉన్నాయని ఆయన లేఖలో ప్రస్తావించారు. రాజ్యాంగ పదవిలో ఉండి 130 కోట్ల మందికి ప్రతినిధిగా ఉండే వ్యక్తి ఇంత దిగజారుడుగా మాట్లాడటం తగదన్నారు. ఈ మేరకు ఆయన ఇటీవల కర్ణాటక హుబ్లీలోని ప్రచార ర్యాలీలో ప్రసంగించిన మోదీ వీడియో క్లిప్పింగ్ ను జతచేశారు. ప్రధానమంత్రి ఇటువంటి మాటలు మాట్లాడకుండా నిలువరించాలని ఆయన రాష్ట్రపతిని లేఖలో కోరారు.
Next Story

