Sun Mar 22 2026 21:33:59 GMT+0530 (India Standard Time)
మోదీని లోకేష్ ఇలా అన్నారే...!

ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా సాధనలో వెనక్కుతగ్గేది లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం నిలదీసిన నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ కక్ష కట్టారన్నారు. కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తామని తెలిపారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ దీక్షలు చేశారన్న కక్షతోనే ఆయనపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తున్నారన్నారు. మోడీ ఆపరేషన్లో భాగంగానే ఆంధ్రులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఇటువంటి దాడులకు భయపడబోమని చెప్పారు.
Next Story

