Fri Dec 05 2025 13:15:12 GMT+0000 (Coordinated Universal Time)
గుహలో ధ్యానానికి దిగిన నరేంద్ర మోడీ
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్యాత్మికచింతనలో మునిగిపోయారు. రెండు రోజుల పర్యటన కోసం కేదార్ నాథ్ వెళ్లిన ఆయన కేదారేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక [more]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్యాత్మికచింతనలో మునిగిపోయారు. రెండు రోజుల పర్యటన కోసం కేదార్ నాథ్ వెళ్లిన ఆయన కేదారేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక [more]

సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్యాత్మికచింతనలో మునిగిపోయారు. రెండు రోజుల పర్యటన కోసం కేదార్ నాథ్ వెళ్లిన ఆయన కేదారేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హియాలయ వాతావరణానికి తగ్గట్లుగా వస్త్రాధరణ చేసిన ఆయన కాషాయంలోకి మారిపోయారు. ఆలయంలో పూజల తర్వాత ఆయన ఆలయానికి కిలోమీటరన్నర దూరంలో ఉన్న ఓ గుహలోకి వెళ్లి ధ్యానానికి కూర్చుకున్నారు. ఇవాళ రాత్రంతా ఆయన గుహలోనే ధ్యానంలో ఉండనున్నారు. నరేంద్ర మోడీ రాక సందర్భంగా కేదార్ నాథ్ ప్రాంతంలో భారీ భద్రతాచర్యలు తీసుకున్నారు.
Next Story