Sun Feb 01 2026 14:14:10 GMT+0000 (Coordinated Universal Time)
మోడీపై మరోసారి అవిశ్వాసం

పార్లమెంటు వర్షాకాల సమావేశంలో మరోసారి అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమయిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం మరోసారి అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరామని, అందుకు హైకమాండ్ అంగీకరించిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఏపీ ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగట్టనున్నామన్నారు. వర్షాకాల సమావేశంలో పార్లమెంటు, రాజ్యసభల్లో తమ పార్టీ సభ్యులు కేంద్రాన్ని నిలదీస్తారని చెప్పారు. గత సమావేశాల్లో మోడీ అవిశ్వాసం నుంచి తప్పించుకుని పారిపోయారని రఘువీరా ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకేను అడ్డం పెట్టుకుని నాటకాలాడారని ఆరోపించారు.
Next Story
