Wed Mar 18 2026 19:10:03 GMT+0530 (India Standard Time)
అది బెయిల్ బండి అన్న మోడీ

కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ప్రముఖులుగా, సీనియర్లుగా ఉన్నవారు ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్నారని, అందుకే ఆ పార్టీని అందరూ బెయిల్ బండిగా పిలవడం ప్రారంభించారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ విధానాలు అందరికీ తెలుసని, పాకిస్థాన్‌పై సర్జికల్ దాడులు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మన సైనిక శక్తి సామార్థ్యాలపై ప్రశ్నలు వేసిందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని ఆయన గుర్తు చేశారు.
Next Story

